"శ్రీ శ్రీ " ఆడియో ఈ నెల 18న...!
కృష్ణ, విజయ నిర్మల కీలక
పాత్రధారులుగా ముప్పలనేని శివ
దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం
‘శ్రీశ్రీ’. సాయిదీప్ చాట్ల, వై.బాలు రెడ్డి,
షేక్ సిరాజ్ నిర్మాతలు. చిత్రీకరణ
పూర్తికావొచ్చింది. ఇందులో నరేశ్,
సుధీర్బాబు, ఆయన రెండో తనయుడు
మాస్టర్ దర్శన కీలక పాత్రలు పోషించడం
ఓ విశేషమైతే మహేశ్బాబు వాయిస్ ఓవర్
ఇవ్వడం మరో విశేషం. దర్శకనిర్మాతలు
మాట్లాడుతూ ‘‘మహాకవి శ్రీశ్రీ రచనలు
ఓ సామాన్యుడిలో స్ఫూర్తి రగిలిస్తే
అతని జీవితం ఎలా ఉంటుందనేదానికి
రూపమే ఈ చిత్రం. వర్తమాన సమాజాన్ని
ప్రతిబింబించేలా ఉంటుంది. ఈ సినిమాకి
మహేశ్బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.
క్లైమాక్స్లో పోలీ్స ఆఫీసర్గా సుధీర్బాబు
కనిపిస్తారు. ఓ చిన్న సన్నివేశం మినహా
చిత్రీకరణ పూర్తైంది. ఇ.ఎస్.మూర్తి
చక్కని పాటలందించారు. ఈ నెల 18న
దాసరి నారాయణరావు, మహేశ్బాబు సహా
పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో
పాటల్ని విడుదల చేస్తున్నాం’’ అని
చెప్పారు.
"శ్రీ శ్రీ " ఆడియో ఈ నెల 18న...!
Reviewed by Movie buzz
on
13:04:00
Rating:

No comments: