రీమేక్ తో వస్తున్న బండ్ల గణేష్...!
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ఇలా టాలీవుడ్ టాప్ హీరోలతో వరుస సినిమాలు చేసిన స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కొంత కాలంగా బ్రేక్ తీసుకున్నాడు. గత ఏడాది రిలీజ్ అయిన టెంపర్ సినిమా తరువాత గణేష్ ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. స్టార్ హీరోలంతా బిజీగా ఉండటంతో పాటు మంచి కథ కూడా దొరక్క పోవటంతో ఇండస్ట్రీగా దూరంగా ఉంటూ వస్తున్నాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లో రీమేక్ సినిమాల సీజన్ నడుస్తుండటంతో గణేష్ కూడా ఓ సక్సెస్ ఫుల్ రీమేక్ తో తిరిగి ఫామ్ లోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే మలయాళంలో సూపర్ హిట్ అయిన 2 కంట్రీస్ సినిమా రైట్స్ ను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడు. దిలీప్, మమతా మోహన్ దాస్ లు జంటగా నటించిన ఈ సినిమాను తెలుగులో స్టార్ హీరోతో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
రీమేక్ తో వస్తున్న బండ్ల గణేష్...!
Reviewed by Movie buzz
on
16:05:00
Rating:

No comments: