సిల్వర్ జూబ్లి జరుపుకున్న శ్రీమంతుడు...
మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు
ఎమ్మిగనూరు - లక్ష్మణ్ థియేటర్లో
డైరెక్ట్గా 175 రోజులు పూర్తి
చేసుకుంది
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు, మైత్రి
మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని,
వై.రవిశంకర్, మోహన్(సివిఎం)
మాట్లాడుతూ - ''మా బేనర్లో నిర్మించిన
'శ్రీమంతుడు' చిత్రం రేపటికి 175
రోజులు పూర్తి చేసుకోబోతోంది. మా మొదటి
ప్రయత్నంగా నిర్మించిన ఈ చిత్రం ఇంత
భారీ విజయాన్ని సాధించడం ఎంతో
ఆనందంగా వుంది. డైరెక్టర్ కొరటాల శివ ఈ
చిత్రాన్ని చాలా అద్భుతంగా రూపొందించి మా
బేనర్కు ఘనవిజయాన్ని చేకూర్చారు. మా
తొలిసినిమాని సూపర్స్టార్ మహేష్తో
నిర్మించడం, అది సిల్వర్ జూబ్లీ చిత్రం
కావడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.
అంతేకాకుండా ఈ చిత్రానికి 6 'ఐఫా'
అవార్డులు రావడం చాలా హ్యాపీగా వుంది''
అన్నారు.
సిల్వర్ జూబ్లి జరుపుకున్న శ్రీమంతుడు...
Reviewed by Movie buzz
on
16:34:00
Rating:
![సిల్వర్ జూబ్లి జరుపుకున్న శ్రీమంతుడు...](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhs-EJ4kkfawv-FwNcij9JJUSe3RN4yy2TtPJDBjRErdmS_MzD92To1VA65Adpc59qyyktKlGYFuQZY8IQmxa2RX3O0nEDT9CUhQZGzMbLEmpYv32927B_jEg6360wcvTFnKtJRwvhG_8U/s72-c/FB_IMG_1453971166704.jpg)
No comments: