72 కోట్లకు కొనేసిదంట...!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పుడే పవర్ చూపిస్తున్నాడు . సినిమా ఇంకా కంప్లీట్ కాకుండానే పవన్ తాజా చిత్రం ''సర్దార్ గబ్బర్ సింగ్ '' ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ 72 కోట్లకు కోనేసిందట ! ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ తో పాటు సాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకున్నారట ఈరోస్ . రిలీజ్ కు ముందే భారీ మొత్తాన్ని అందుకొని సంచలనం సృష్టించాడు పవన్ కళ్యాణ్ . బాబీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు . కాగా ఈ చిత్ర ఆడియో వేడుకని మార్చిలో నిర్వహించి ఏప్రిల్ లో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
72 కోట్లకు కొనేసిదంట...!
Reviewed by Movie buzz
on
15:08:00
Rating:
![72 కోట్లకు కొనేసిదంట...!](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhesIOVVLQA1kEeuzyTrHROmY3TtgD62bMSFj0FQq3vcyERZK46kFpSKbm9gXqSoiroWWCSuhVOo-AodvpPYSawYqT_aTfpU-NrYpQBNfaoZIyBDAmKoY-eKAIlQpK5lVOB6kp0frqqWGg/s72-c/Sardar-Gabbar-Singh-e1441275983456.jpg)
No comments: