పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్......?
త్రివిక్రమ్
డైరెక్షన్లో లవర్ బాయ్ నితిన్ హీరోగా
తెరకెక్కుతోన్న అ..ఆ షూటింగ్ శరవేగంగా
జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్
గెస్ట్ రోల్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్
ఇచ్చాడని వినిపిస్తోంది. ఈ విషయమై
ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్
రాకపోయినప్పటికి సంక్రాంతి లోపు క్లారిటీ
వచ్చే అవకాశం ఉందంటున్నారు... పవన్
కళ్యాణ్కి ఉన్న ఆప్తుల్లో త్రివిక్రమ్
ప్రముఖుడు... వీరిద్దరి కాంబినేషన్లో
వచ్చిన జల్సా... అత్తారింటికి దారేది
చిత్రాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. తన
లేటెస్ట్ మూవీ అ..ఆలో అతిధి పాత్ర
పోషించాల్సిందిగా పవర్ స్టార్ను త్రివిక్రమ్
అడగ్గా... ఆ ప్రపొజల్కు పవన్ కూడా
పాజిటివ్ గానే స్పందించాడని సమాచారం..
అలాగే యంగ్ హీరో నితిన్కు సైతం పవర్
స్టార్ అంటే....అమితమైన గౌరవంతో పాటు
పవన్కు వీరాభిమాని కూడా కావడం విశేషం.
పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్......?
Reviewed by Movie buzz
on
17:04:00
Rating:
Reviewed by Movie buzz
on
17:04:00
Rating:

No comments: