విక్రమ్ దర్వకత్వంలో మహేష్,స్టైలిష్ స్టార్
దర్శకుడు విక్రమ్
కె కుమార్. ఆసక్తికరమైన కథా కథనాలతో సినిమాలను
తెరకెక్కించే ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం
సూర్య హీరోగా 24 సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
కాలంలో ప్రయాణించటం అనే కాన్సెప్ట్తో
తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపుగా పూర్తి
కావస్తుండటంతో తన నెక్ట్స్ సినిమాను కూడా
లైన్లో పెట్టే ఆలోచనలో ఉన్నాడు విక్రమ్.
తనకు స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన టాలీవుడ్లోనే
తన నెక్ట్స్ సినిమా చేయాలని భావిస్తున్నాడట.
ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు, స్టైలిష్
స్టార్ అల్లు అర్జున్లకు కథలు వినిపించిన
విక్రమ్ కె కుమార్ ఆ ఇద్దరితో సినిమాలు చేయడానికి
రెడీ అవుతున్నాడు. అయితే బ్రహ్మోత్సవం సినిమా
షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్, ఆ తరువాత
మురుగదాస్ దర్శకత్వంలో సినిమాకు కమిట్
అయ్యాడు.
బోయపాటి దర్శకత్వంలో సరైనోడు సినిమా చేస్తున్న
బన్నీ, ఇంతవరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను ఫైనల్
చేయలేదు. దీంతో విక్రమ్ కె కుమార్ ముందుగా
బన్నీతోనే సినిమా స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడట.
ఆ సినిమా తరువాత మహేష్ సినిమాను ప్లాన్ చేసే
ఆలోచనలో ఉన్నాడు విక్రమ్ కె కుమార
విక్రమ్ దర్వకత్వంలో మహేష్,స్టైలిష్ స్టార్
Reviewed by Movie buzz
on
17:07:00
Rating:

No comments: