హాలీవుడ్ రేంజ్లో మహేష్ ...
పూరి
జగన్నాథ్, ఆ తరువాత కూడా తను చేయబోయే
సినిమాలను లైన్లో పెట్టాడు. లోఫర్ తరువాత రోగ్
పేరుతో బైలింగ్యువల్ సినిమా చేస్తున్న పూరి,
మహేష్ బాబుతో భారీ సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు.
ఆ సినిమాలో మహేష్తో పాటు పలువురు హాలీవుడ్
స్టార్లు కూడా నటించేలా ప్లాన్ చేస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ
భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను
నిర్మించడానికి రెడీ అవుతోంది.
మహేష్ బాబు, ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల
దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో
నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మురుగదాస్
దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న
సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు
పూర్తి కావటానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది.
ఈ లోగా పూరి కూడా తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ను
పూర్తి చేసి మహేష్ సినిమాకు పక్కా స్క్రీప్ట్తో రెడీ
అవ్వాలని భావిస్తున్నాడు. 2017లో పూరి
మహేష్ల హ్యాట్రిక్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్
కనిపిస్తోంది.
హాలీవుడ్ రేంజ్లో మహేష్ ...
Reviewed by Movie buzz
on
20:54:00
Rating:

No comments: