"srimanthudu" helping hand....





‘శ్రీమంతుడు’ సైకిల్ కాంటెస్ట్ ద్వారా
వచ్చిన మొత్తంలో బసవతారకం కేన్సర్
ఆసుపత్రికి రూ.5లక్షలు, హీల్ ఎ చైల్డ్
ఫౌండేషనకు రూ.10లక్షల చెక్కులను
చిత్ర యూనిట్ బుధవారం అందజేసింది.
మహేష్, శ్రుతిహాసన జంటగా కొరటాల శివ
దర్శకత్వంలో మైత్రీ మూవీస్ పతాకంపై
నవీన ఎర్నేని, వై.రవిశంకర్, మోహన కలిసి
‘శ్రీమంతుడు’ సినిమాను నిర్మించిన
విషయం తెలిసిందే. చిత్ర దర్శకుడు
కొరటాలశివ మాట్లాడుతూ ‘‘శ్రీమంతుడు
మంచి పాయింట్ అనుకుని తీశాం. నోబుల్
కాజ్తో తీసిన సినిమా అని ఆదరించిన ప్రతి
ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని తెలిపారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన వై.రవిశంకర్
మాట్లాడుతూ ‘‘ఈ కాంటెస్ట్ కోసం దాదాపు
2,200 మంది ఎనరోల్ చేసుకున్నారు.
వారందరికీ టీ షర్టులు, ఇతరత్రా
పంపిస్తున్నాం. ఆ ఖర్చులన్నీ పోగా
మిగిలిన రూ.15లక్షలను ఈ రెండు
సంస్థలకు ఇవ్వడం ఆనందంగా ఉంది’’
అని చెప్పారు. ఈ కార్యక్రమంలో
బసవతారకం కేన్సర్ ఇన్స్టిట్యూట్
తరఫున సి.హెచ్.సత్యనారాయణ, హీల్ ఎ
ఛైల్డ్ తరఫున సబీనా, కేరన భాట్యా,
రచనా మెహతా పాల్గొన్నారు.
"srimanthudu" helping hand.... "srimanthudu" helping hand.... Reviewed by Movie buzz on 12:12:00 Rating: 5

No comments:

Theme images by luoman. Powered by Blogger.