brahmotsavam movie realease date ...!



సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం
బ్రహ్మోత్సవం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల
తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ
చిత్రాన్ని పి.వి.పి సంస్థ భారీ స్ధాయిలో
నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత,
కాజల్, ప్రణీత నటిస్తున్నారు. బంధాలు, అనుబంధాలు
నేపధ్యంతో సాగే ఈ చిత్రాన్ని చక్కని కుటుంబ కథా
చిత్రంగా శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్నారు.
మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో గతంలో
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా
రూపొందింది. ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్
చేసిందో అందరికీ తెలిసిందే. మళ్లీ మహేష్, శ్రీకాంత్
అడ్డాల కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు
ఉంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా
బ్రహ్మాత్సవం సినిమా ఉంటుందంటున్నారు
చిత్రయూనిట్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న రిలీజ్ చేయడానికి ప్లాన్
చేస్తున్నారు
brahmotsavam movie realease date ...! brahmotsavam movie realease date ...! Reviewed by Movie buzz on 12:08:00 Rating: 5

No comments:

Theme images by luoman. Powered by Blogger.