300 crores deal for superstar ...!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు
మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తెలుగులో మహేష్ బాబు
సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయనతో భారీ
డీల్స్ కుదుర్చుకోవడానికి పలు భారీ సినీ నిర్మాణ
సంస్థలు పోటీ పడుతున్నాయి. ‘శ్రీమంతుడు'
విజయం తర్వాత ఈ పోటీ మరింత ఎక్కువైంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ
బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్
మహేష్ బాబుతో రూ. 300కోట్ల విలువైన భారీ డీల్ను
కుదుర్చుకున్నట్లు సమాచారం. తెలుగు సినిమా
చరిత్రలో ఒక హీరోతో ఈ రేంజిలో డీల్ కుదరడం ఇదే
ప్రథమం అంటున్నారు. అయితే ఈ డీల్ ఎలా
ఉండబోతోంది? ఆ సంస్థతో ఎన్ని సినిమాలు
చేస్తారు? అనేది తెలియాల్సి ఉంది.
రెమ్యూనరేషన్లో కూడా రికార్డ్...
మహేష్, మురగదాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రెడీ
అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంకు
సంభంధించిన కథ ఫైనలైజ్ చేసి ఇప్పుడు కాస్టింగ్
మొదలు పెట్టారు. హీరోయిన్ గా శృతి హాసన్ ని ఫైనలైజ్
చేసారు. అలాగే...ఏప్రిల్ రెండవ వారం 2016 నుంచి
షూటింగ్ ప్రారంభం కానుందని సమచారం. తాజాగా
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు మహేష్
బాబు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్
తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో ఇప్పటి
వరకు ఇదే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అని టాక్.
300 crores deal for superstar ...!
Reviewed by Movie buzz
on
12:15:00
Rating:

No comments: