srimanthudu cycle winner....





మహేష్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్,
ఎం.బి. ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ
దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్,
సి.వి.మోహన్ (సివిఎం) నిర్మించిన చిత్రం
'శ్రీమంతుడు'. ఈ చిత్రం నవంబర్ 14కి 15
కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది.
ఈ చిత్రంలో సూపర్స్టార్ మహేష్ ఉపయోగించిన
సైకిల్కి సంబంధించి గత కొంతకాలంగా ఒక కాంటెస్ట్ రన్
అవుతున్న సంగతి తెలిసిందే. ఈ కాంటెస్ట్కి
ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి అద్భుతమైన
స్పందన వచ్చింది. వేలాదిగా ఈ కాంటెస్ట్లో
పాల్గొన్నారు. నవంబర్ 13తో ఈ కాంటెస్ట్ ముగిసింది.
నవంబర్ 14న సూపర్స్టార్ మహేష్ బాబు డ్రా తీసి
ఈ కాంటెస్ట్లో విజేతను ఎంపిక చేసారు.
ఈ లక్కీ డ్రాలో జి. నాగేందర్ రెడ్డి శ్రీమంతుడు సైకిల్
దక్కించుకున్నాడు. మహేష్ బాబు చేతుల మీదుగా
అతనికి శ్రీమంతుడు సైకిల్ అందజేయనున్నారు.
srimanthudu cycle winner.... srimanthudu cycle winner.... Reviewed by Movie buzz on 11:44:00 Rating: 5

No comments:

Theme images by luoman. Powered by Blogger.