one more tamil movie rights taken by ramcharan


రామ్ చరణ్ తమిళ చిత్రం తని
ఓరువన్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా చరణ్ మరో తమిళ మూవీ 49 - ఓ రీమేక్
రైట్స్ తీసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో
గౌండమణి హీరోగా నటించారు. చాలా గ్యాప్ తరువాత
ఆయన రైతుల సమస్యలపై ఈ మూవీ చేసారు.
గౌతమ్ మీనన్ శిష్యుడు పి.ఆరోగ్యదాస్ ఈ మూవీకి
దర్శకత్వం వహించారు. గౌండమణి కోసం...ఈ చిత్ర
కథ కోసం సినిమా చూడాల్సిందే అంటుంది తమిళ
మీడియా.
దీంతో రామ్ చరణ్ ఇటీవల ఈ మూవీ చూసి రీమేక్
రైట్స్ తీసుకున్నారని ఫిలింనగర్ టాక్. కత్తి రీమేక్
రైట్స్ తీసుకున్న చరణ్ 49 - ఓ రీమేక్ రైట్స్ కూడా
తీసుకోవడం ఆసక్తిగా మారింది. ప్రొడక్షన్ హూస్
ప్రారంభించనున్న చరణ్ వేరే హీరోలతో నిర్మించేందుకే
ఈ మూవీ రైట్స్ తీసుకున్నారని కొందరు
అంటుంటే...కత్తిలో మార్పులు చేయడం కోసం
తీసుకున్నారని మరి కొందరి వాదన...ఏది ఏమైనా ఈ
మూవీ ఎవరితో చేస్తారు అనేది తెలియాలంటే కొన్ని
రోజులు ఆగాల్సిందే.
one more tamil movie rights taken by ramcharan one more tamil movie rights taken by ramcharan Reviewed by Movie buzz on 11:40:00 Rating: 5

No comments:

Theme images by luoman. Powered by Blogger.