ప్రభాస్ అంటే చాలా ఇష్టం.....




వరుణ్
తేజ్, అభిమానులకు దగ్గరయ్యే పనిలో పడ్డాడు.
ఇటీవలే లోఫర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఈ మెగా
హీరో, ట్విట్టర్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు
సమాధానాలు చెప్పాడు. ఈ సందర్భంగా వరుణ్ చేసిన
కామెంట్స్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను
కూడా ఆకర్షించాయి.
మెగా కుటుంబంలో మీకు నచ్చిన డ్యాన్సర్ ఎవరూ
అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు, మెగాస్టార్
చిరంజీవి తరువాత అంత మంచి డ్యాన్సర్ చరణ్
అన్నయ్యేనని సమాధానం ఇచ్చాడు. మెగా
ఫ్యామిలీలో అందరూ మంచి డ్యాన్సర్లే అయిన
వరుణ్ మాత్రం చరణ్ వైపే మొగ్గు చూపాడు.
ఇక మెగా కుటుంబం నుంచి కాకుండా ఇతర హీరోల్లో
మీకు బాగా నచ్చిన హీరో ఎవరు అన్న ప్రశ్నకు, '
నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం, ఆయన లుక్స్,
యాక్టింగ్ చాలా బాగుంటాయి' అంటూ అందరిని
ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా ఫ్యామిలీ ఇమేజ్
ఉన్న హీరోలు ఇంత ఓపెన్గా ఇతర హీరోల పేర్లు
చెప్పడం చాలా అరుదు. అందుకే వరుణ్ తన
సమాధానంతో మెగా అభిమానులతో పాటు రెబల్ స్టార్
అభిమానులను కూడా తన వైపు తిప్పుకున్నాడు.
ప్రభాస్ అంటే చాలా ఇష్టం..... ప్రభాస్ అంటే చాలా ఇష్టం..... Reviewed by Movie buzz on 11:34:00 Rating: 5

No comments:

Theme images by luoman. Powered by Blogger.