పవర్ స్టార్ సంచలన నిర్ణయం ...!
పవన్
కళ్యాణ్
అంటే
చాలు
తెలుగు
రాష్ట్రాల్లో
అయన
పేరు
చెబితేనే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి. ఆ
రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్న
పవన్ కళ్యాణ్ సమాజంలో జరుగుతున్న
అన్యాయాన్ని ప్రశ్నించడానికి 'జనసేన పార్టి' ని
స్థాపించిన విషయం తెలిసిందే! అప్పుడప్పుడు
మీడియా ముందుకు వచ్చి రాజకీయంగా జరిగే పలు
తప్పులను నిలదిస్తూ వస్తున్నాడు. అయితే ఓ
పక్క సినిమాలు చేస్తూ మరొక పక్క రాజకీయాలు
చేస్తుండడం వల్ల ఏ దానికి న్యాయం
చేయలేకపోతున్నాడని భావించిన పవన్ తాజాగా
రాజకీయాలపై ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే
ఎలక్షన్స్ వరకు రాజకీయా విషయాలను పూర్తిగా
పక్కకు పెట్టి, తన దృష్టి అంత సినిమాలపై ఉంచి,
తన అభిమానులకు వరుస సినిమాలతో మేప్పించాలని
నిర్ణయం తిసుకున్నాడట. ఇప్పటికే ప్రస్తుతం
చేస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని యమ
స్పీడ్ లో పూర్తి చేసి సమ్మర్ లో విడుదల
చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఆ తర్వాత
ఖుషి కొమరం పులి చిత్రాల దర్శకుడు ఎస్ జే
సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ
అవుతున్నాడు.దిని తర్వాత రభస దర్శకుడు సంతోష్
శ్రినివార్ దర్శకత్వంలో తమిళ 'వేదాళం' చిత్రాన్ని
రీమేక్ చేయనున్నాడు.
పవర్ స్టార్ సంచలన నిర్ణయం ...!
Reviewed by Movie buzz
on
21:42:00
Rating:
Reviewed by Movie buzz
on
21:42:00
Rating:

No comments: