clarity on mahesh ,murugadas movie. ..!









సూపర్ స్టార్ మహేష్ బాబు, సౌత్ ఇండియన్
స్టార్ డైరెక్టర్ మురుగదాస్ల కాంబినేషన్లో ఓ
సినిమా రూపొందనుందన్న విషయం తెలిసిందే.
అయితే త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ
సినిమాపై ఇటీవల ఓ వార్త ప్రిన్స్ అభిమానులను
కలవర పరిచింది. మురుగదాస్ ముందుగా అజిత్తో
సినిమా చేయటం కోసం కథ రెడీ చేసుకున్నాడని. ఆ
కథను అజిత్ కాదనటంతో ఇప్పుడు అదే కథతో
మహేష్తో సినిమా చేస్తున్నాడన్న టాక్ వినిపించింది.
అయితే ఈ వార్తలను దర్శకుడు మురుగదాస్
ఖండించాడు. ఎవరి ఇమేజ్కు తగ్గట్టుగా వారికి
కథలు రాసుకుంటామని, మహేష్ కోసం రాసిన కథ తన
కోసం ప్రత్యేకంగా తయారు చేశానని క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా
ఫిబ్రవరిలో మొదలు కానుంది. ఆరు నెలల్లోనే ఈ
సినిమాను పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు
చిత్రయూనిట్. సంతోష్ శివన్, హారిస్ జయరాజ్ లాంటి
టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్న ఈ సినిమాను
ఠాగూర్ మధు, ఎన్ వి ప్రసాద్లు భారీ బడ్జెట్తో
నిర్మిస్తున్నారు.



(Image source : apnewscorner)
clarity on mahesh ,murugadas movie. ..! clarity on mahesh ,murugadas movie. ..! Reviewed by Movie buzz on 11:25:00 Rating: 5

No comments:

Theme images by luoman. Powered by Blogger.