three herohines in sardaa gabbar singh movie



సర్దార్ గబ్బర్ సింగ్
మూవీ షూటింగ్ తో పవన్ కళ్యాణ్ బిజీగా
ఉన్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే కాజల్ అగర్వాల్,
లక్ష్మీరాయ్ తో చిందేస్తున్న పవన్ తో
జతకట్టేందుకు ఇప్పుడు కన్నడ హాట్
బ్యూటీ సంజన కూడా రెడీ అయింది.
గుజరాత్ లోని వడోదరలో ప్రస్తుతం ఈ సినిమా
షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే హీరోయిన్ కాజల్
అగర్వాల్, బ్రహ్మానందం ఈ షూటింగ్ లో
జాయిన్ అయ్యారు. వీరిద్దరి కాంబినేషన్ లో
కొన్ని కామెడీ సీన్స్ షూట్ చేస్తున్నట్టు
తెలుస్తోంది. ఇక ఇప్పటికే లక్ష్మీరాయ్ ఈ
సినిమాలో ఐటమ్ సాంగ్ తో పాటు కీలకపాత్రలో
నటిస్తుండగా.. ఇప్పుడు ‘బుజ్జిగాడు’ ఫేం
సంజనను మరో ముఖ్యపాత్ర కోసం ఎంపిక
చేశారట.
సర్దార్ గబ్బర్ సింగ్ లో సంజన కనిపించేదే కాసేపే
అయినా.. ప్రాధాన్యమున్న పాత్రనే
పోషిస్తోందట ఈ కన్నడ బ్యూటి. త్వరలోనే
సంజన సీన్స్ కు సంబంధించిన చిత్రీకరణ
జరగనుందట. టాలీవుడ్ కెరీర్ కు టాటా
చెపుదామనుకున్న టైమ్ లో ఇలా పవన్ సరసన
ఛాన్స్ రావడంపై సంజన ఫుల్ హ్యాపీగా ఉందట.
మరి.. ఈ సినిమాతో అయినా అమ్మడి దశ
తిరుగుతుందో లేదో..!
three herohines in sardaa gabbar singh movie three herohines in sardaa gabbar singh movie Reviewed by Movie buzz on 10:19:00 Rating: 5

No comments:

Theme images by luoman. Powered by Blogger.