sudeep intrested in power star movies...!





సుదీప్..
కన్నడలో వరుసగా తెలుగు సినిమాలను రీమేక్
చేస్తున్నాడు. ప్రభాస్ హిట్ మూవీ మిర్చిని
మాణిక్య పేరుతో కన్నడలో రీమేక్ చేసి.. గత
ఏడాది సూపర్ హిట్ ను అందుకున్నాడు సుదీప్.
ఇక ఈ ఏడాది ‘అత్తారింటికి దారేది’ని రన్న పేరుతో
రీమేక్ చేసి మరో హిట్ అందుకున్న సుదీప్…
ఇప్పుడు మరో పవన్ సినిమాపై
మనసుపడ్డాడట.
పవన్-వెంకటేశ్ కలసి నటించిన గోపాల-గోపాల
సినిమాను కన్నడలో రీమేక్ చేయనున్నాడట
సుదీప్. బాలీవుడ్ హిట్ మూవీ ఓ మై గాడ్ కు ఇది
రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే
ఇన్నాళ్లు బాలీవుడ్ సినిమా వైపు కన్నెత్తి కూడా
చూడని సుదీప్… పవన్ నటించగానే ఈ రీమేక్ లో
తాను నటించేందుకు సన్నద్దమయ్యాడు.
పవన్ పోషించిన పాత్రలో తాను
నటించాలనుకుంటున్న సుదీప్… వెంకటేష్
పోషించిన క్యారెక్టర్ కోసం ఉపేంద్రను
సంప్రదిస్తున్నాడట. దేవుడిపై నమ్మకం లేని
నాస్తికుని పాత్రకు ఉపేంద్ర అయితే బెటర్ అని
భావిస్తున్నాడట. ఉపేంద్ర ఓకే చెప్పగానే ఈ
సినిమా సెట్స్ పైకి వెళుతుందట. మరి హిందీతో
పాటు తెలుగులోనూ మెప్పించిన ఈ సినిమా..
కన్నడలోనూ సక్సెస్ సాధిస్తుందేమో చూద్దాం..!
sudeep intrested in power star movies...! sudeep intrested in power star movies...! Reviewed by Movie buzz on 12:25:00 Rating: 5

No comments:

Theme images by luoman. Powered by Blogger.