రికార్డులు సృష్టించిన సర్దార్ ప్రీ బిజినెస్..!
“సర్దార్ గబ్బర్ సింగ్” సినిమా ఇంకా
షూటింగ్ పార్ట్ పూర్తి కాలేదు. కాని బిజినెస్ మాత్రం
మంచి జోరు మీదుంది. ఇప్పటివరకు అందుతున్న
సమాచారం ప్రకారం “సర్దార్…” మొత్తం ధియేట్రికల్
రైట్స్ ని చాలా పెద్ద మొత్తంలో “ఈరోస్…” సంస్థ
సొంతం చేసుకుంది. సొంతం చేసుకోవడమే కాదు కొన్ని
ఏరియాల రైట్స్ ని వేరే పార్టీలకు అమ్మడం కూడా
జరిగింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వైజాగ్
ఏరియా సుమారు 7.2 కోట్లకు “ఈరోస్” సంస్థ
అమ్మినట్టు విశ్వసనీయ సమాచారం.
ఇప్పటివరకు “బాహుబలి” కి జరిగిన 7 కోట్ల
రూపాయలే అత్యధిక మొత్తం వైజాగ్ లో. అంతకంటే
ఎక్కువ మొత్తంలో బిజినెస్ జరగడం వల్ల,
విడుదలకు ముందు “బాహుబలి” పై “సర్దార్…”
పైచేయి సాధించినట్టయింది. మిగిలిన తెలుగు
సినిమాలేవీ ఆ మొత్తానికి దగ్గరలో కూడా లేవు.
ఇప్పుడు పవన్ అతని రికార్డుల వేటని వైజాగ్ లో
మొదలుపెట్టాడు. మిగిలిన ఏరియాల బిజినెస్ వివరాలు
కూడా బయటికి వస్తే పవర్ స్టార్ వేట ఏ స్థాయి
వరకు వెళ్ళబోతుందో తెలుస్తుంద
రికార్డులు సృష్టించిన సర్దార్ ప్రీ బిజినెస్..!
Reviewed by Movie buzz
on
21:34:00
Rating:
![రికార్డులు సృష్టించిన సర్దార్ ప్రీ బిజినెస్..!](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiBYDeNi5nNA0clig-FVt4ro81THDehxEXbwivAokuO2a9u-m9sl1n59-LDBJhlrDs6DXf3XAXcKdYkLDmDxZm6u5D1cKR52KgxPMngzniawsiQgvhNMvGRYZqDHyVyzlwJASIyT8OYcw4/s72-c/pawan-story_647_082515032443.jpg)
No comments: