హైదరాబాద్లో బ్రహ్మొత్సవం షూటింగ్. ...!
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్
బాబు హీరోగా నటిస్తున్న చిత్రం
‘బ్రహ్మోత్సవం’. కాజల్, సమంత,
ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు.
పివిపి బ్యానర్పై రూపొందుతున్న ఈ
సినిమాలో శుభలేఖ సుధాకర్ కాజల్ తండ్రి
పాత్రలో నటిస్తుండగా సత్యరాజ్, తులసి
తదితరులు ఇతర కీలక పాత్రల్లో
నటిస్తున్నారు. ఏప్రిల్ 29న విడుదల
కానున్న ఈ సినిమా ఇటీవల చెన్నై
షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. చెన్నైలో
అంబత్తూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో
మహేష్ బాబు, సత్యరాజ్లపై కొన్ని కీలక
సన్నివేశాలను షూట్ చేశారు. సంక్రాంతి
పండగ సందర్భంగా తీసుకున్న చిన్నపాటి
గ్యాప్ అనంతరం రేపట్నుండి హైదరాబాద్లో
‘బ్రహ్మోత్సవం’ తర్వాతి షెడ్యూల్
మొదలవనుంది. ఈ షెడ్యూల్లో మహేష్
- సమంతలపై కొన్ని సన్నివేశాలను
చిత్రీకరించనున్నారు
హైదరాబాద్లో బ్రహ్మొత్సవం షూటింగ్. ...!
Reviewed by Movie buzz
on
17:38:00
Rating:

No comments: